రోజు ఉదయం లేవగానే నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సినవి ఇవే..

 రోజు ఉదయం  లేవగానే నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సినవి ఇవే..

నిద్ర లేవగానే వెంటనే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం అనేది ప్రస్తుతం ఒక  అలవాటుగా మారింది. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.... 

విటమిన్-సి పెరుగుతుందా ? 
అవును, నిమ్మకాయ నీటి వల్ల శరీరానికి విటమిన్-సి అందుతుంది. ఒక నిమ్మకాయ ద్వారా మనకు రోజుకు అవసరమైన విటమిన్-సి లో దాదాపు 21% లభిస్తుంది. అయితే, ఒక్క రోజు తాగగానే విటమిన్ స్థాయిలు పెరిగిపోవు. రోజు తప్పకుండా తీసుకుంటేనే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read : మూడు పూటలా అన్నమే తినే జపాన్ వాళ్లు స్లిమ్గా, హెల్తీగా.. మనం ఏమో లావుగా

ఉదయాన్నే తాగడం వల్ల కలిగే లాభాలు:
రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం తిరిగి ఉత్తేజితం అవుతుంది. నిమ్మ రసం జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను (Toxins) బయటకు పంపడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా మోటబోలిజం మెరుగుపరుస్తుంది, దీనివల్ల ఆహారం త్వరగా శక్తిగా మారుతుంది.

నిమ్మకాయలో పోషక విలువలు:
శక్తి: 10.6 కేలరీలు
విటమిన్-సి: రోజు అవసరంలో 21%
పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి5, బి1, బి2 వంటివి స్వల్పంగా ఉంటాయి.

అయితే నిమ్మకాయ నీళ్లు తాగినంత మాత్రాన అన్ని రోగాలు తగ్గవు. ఇదొక మంచి ఆరోగ్య అలవాటు మాత్రమే. విటమిన్-సి ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే గోరువెచ్చని నీటిలో కలుపుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగే ముందు డాక్టరును సంప్రదించండి.  పండగలు లేదా పార్టీల సమయంలో ఎక్కువగా తిన్నప్పుడు తరువాత రోజు ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది.