భారత విమానాలపై నిషేధం పొడిగించిన కెనెడా

భారత విమానాలపై నిషేధం పొడిగించిన కెనెడా

ఒట్టావా: భారత దేశం నుండి నేరుగా విమానాల రాకపోకలపై నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది. కరోనా నేపధ్యంలో అనేక దేశాలు విదేశీ ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారత విమానాలను నిషేధించిన కెనెడా ఈ  నిషేధాన్ని వచ్చే సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 
కొత్త వేరియంట్లు భారత్ లో వెలుగులోకి వస్తున్నాయనే కారణంతో గత ఏప్రిల్ 22వ తేదీన భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాల రాకపోకలను కెనెడా నిషేధం విధించిన విషయం తెలిసిందే. కేవలం ప్రయాణికుల విమానాలను నిషేధించిన కెనెడా.. కార్గో రవాణా విమానాలు, వైద్య సామగ్రి, మిలిటరి విమానాల రాకపోకలకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా భారత్ లో థర్డ్ వేవ్ మొదలైన సూచనలు కనిపిన్నాయని.. కేసులు వేగంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న కెనెడా ప్రయాణికుల విమానాలకు ససేమిరా అంటోంది. నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని కెనెడాకు రావడాన్ని మాత్రం అనుమతిస్తోంది.