పెద్దపల్లి తహశీల్దార్,ఆర్ఐతోపాటు 9మందిపై కేసు నమోదు

పెద్దపల్లి తహశీల్దార్,ఆర్ఐతోపాటు 9మందిపై కేసు నమోదు

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ భవాని ప్రసాద్ తోపాటు మరో 9మంది పై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్డు దగ్గరలోని సర్వే నెం.577/2 లో రెండు ఎకరాల 19 గుంటల భూమిని కోర్టు పరిధిలో ఉండగా వేరే వారికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. కోట్ల రూపాయల విలువైన భూమి విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాలతో పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎమ్మార్వో, ఆర్.ఐలతోపాటు మరో 9మందిపై కేసు నమోదు చేయడం కలకలం సృష్టిస్తోంది.