ఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన

 ఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన

వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో  సమగ్ర కులగణనకు బుధవారం (నవంబర్15)  శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్ర కులగణన చేపట్టనుంది.  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు ఈ కులగణన జరగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు  మంత్రిచెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. కులగణన ప్రక్రియ రాష్ట్రంలో మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ చిత్రపటానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పాలాభిషేకం చేశారు.

 గత ప్రభుత్వం  పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో చూస్తే ...పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి చేర్చాలో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని కొనియాడారు. అందుకు నిదర్శనమే ఈ సమగ్ర కులగణన ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. సమగ్ర కులగణన ద్వారా తమ వర్గాల యొక్క మనోభావాలను రక్షించిన నాయకుడిగా వైఎస్ జగన్ నిలిచారన్నారు. కులగణన ప్రక్రియలో తనను కీలకమైన భాగస్వామ్యం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

also read :- చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు

గ్రామ స్వరాజ్యమనే మహాత్ముల లక్ష్యాన్ని సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన తప్ప కులగణన జరగలేదన్నారు.  డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కులగణనతో సాధించబోతున్న నాయకుడు వైఎస్ జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. ఉన్నతవర్గాలలోని పేదలతోపాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుంది అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అభిప్రాయపడ్డారు.