కారులో మహిళ.. కిడ్నాప్కు దుండగుల యత్నం

కారులో మహిళ.. కిడ్నాప్కు దుండగుల యత్నం

హర్యానాలోని యమునా నగర్ లో ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు దుండగులు  ప్రయత్నించారు. జిమ్ నుంచి బయటకు వచ్చిన మహిళ కారు ఎక్కి కూర్చుండగా హఠాత్తుగా ప్రత్యక్షమైన నలుగురు దుండగులు కారు డోర్ ఓపెన్ చేసి మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. 

మహిళ కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు కారు దిగి పరారయ్యారు. దుండగుల్లో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మహిళ కిడ్నాప్ యత్నానికి సంబంధించిన విజువల్స్ స్థానికంగా ఉండే సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు  డీఎస్పీ కమల్ దీప్ సింగ్ తెలిపారు. దుండగులు ఎందు కోసం కిడ్నాప్ కు ప్రయత్నించారు.. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా.. ? వీరి టార్గెట్ ఏమిటి అన్న వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నినిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.