మీలాంటోళ్ల వల్లే : లంచం అడిగిన రైల్వే అధికారి అరెస్ట్

మీలాంటోళ్ల వల్లే : లంచం అడిగిన రైల్వే అధికారి అరెస్ట్

ఈ మధ్య లంచం తీసుకుంటూ పట్టుబడే వారి జాబితా పెరిగిపోతుంది. రోజుకో చోట ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు ఓ రైల్వే డీఆర్ఎం సూపరింటెండెంట్ ఆఫీసులో అకౌంట్స్ ప్రాసెసింగ్ అధికారి అడ్డంగా దొరికాడు. బాధితుడిని నుంచి డబ్బులు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే 

ముంబైలోని పశ్చిమ రైల్వేలోని డీఆర్ఎం సూపరింటెండెంట్ ఆఫీసులో అకౌంట్స్ ప్రాసెసింగ్ అధికారిగా సంజయ్ వాఘేలా విధులు నిర్వహిస్తున్నాడు. వాషి నివాసం ఉంటున్న ఓ కంపెనీ యజమానీ పశ్చిమ రైల్వేలో వివిధ కాట్రక్టులు చేపడుతున్నాడు. ఇటీవల పశ్చిమ రైల్వేలో రూ. 4.80 కోట్ల కాంట్రాక్టు చేపట్టాడు. ఈ మొత్తం కాంట్రక్టుకు బిల్లు పాస్ చేయాలంటే లక్షకు రూ.100 లంచం చెల్లించాలని వాఘేలా, కాంట్రక్టర్ ను డిమాండ్ చేశాడు. 

మొత్తం రూ. 50 వేలు చెల్లిస్తేనే బిల్లు పాస్ అవుతుందని బెదించాడు. దీంతో కాంట్రాక్టర్ దిక్కుతెలియక సిబీఐ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు వాఘేలా రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుుకున్నారు.  అరెస్టు చేసిన నిందితుడిని శుక్రవారం ముంబైలోని కాంపిటెంట్ కోర్టులో హాజరుపరిచారు.