రాష్ట్ర బీజేపీ లీడర్లు స్వాగతించినా కేంద్రం స్పందించట్లే..!

రాష్ట్ర బీజేపీ లీడర్లు స్వాగతించినా కేంద్రం స్పందించట్లే..!

కాళేశ్వరం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరడంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ లీడర్లంతా స్వాగతించారు. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి నోటిఫికేషన్​ మాత్రం రాలేదు. గతంలో సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్​ చేసిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి..  రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తే 48 గంటల్లో సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని చెప్పారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని స్వాగతించారు.

 బీజేపీ మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పెద్దలను రక్షిస్తున్నదని, అందుకే చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు పరిధిని మూడు బ్యారేజీలకు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మాత్రమే పరిమితం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనా సీబీఐ దర్యాప్తు కోరాలని, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం సీబీఐ విచారణను స్వాగతించారు. ఆయన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను వ్యతిరేకించినప్పటికీ.. సీబీఐ నిజాయితీగా దర్యాప్తు చేస్తుందని అభిప్రాయపడ్డారు.