వేములవాడలో కుక్క దాడిలో 21 మంది భక్తులకు గాయాలు

వేములవాడలో కుక్క దాడిలో 21 మంది భక్తులకు గాయాలు

వేములవాడ, వెలుగు: కుక్క దాడిలో వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు గాయపడ్డారు. స్థానిక జాతర గ్రౌండ్, గాంధీనగర్​  ఏరియాలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు 21 మందిని గాయపర్చింది. బాధితులకు వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. నలుగురికే తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్​   నిక్షిప్త తెలిపారు. మెరుగైన వైద్యం కోసం  సిరిసిల్ల ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

కోతుల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ 3వ వార్డులో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పెద్దపాడుకు చెందిన అనిల్, మేరీ దంపతులు క్రిస్మస్​ సందర్భంగా గురువారం తమ కుమార్తె అన్షుతో కలిసి అయిజలోని బంధువుల ఇంటికి వచ్చారు. బయట ఆడుకుంటున్న పాపపై కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్ ​చేయించారు.