న్యూఢిల్లీ: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యే ముందు తాను ఆయనను కలిశానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నిరుడు జులై 31న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారని తెలిపారు. గురువారం ఢిల్లీలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున టెహ్రాన్ వెళ్లా. అక్కడ హనియాను కలిశాను. ప్రమాణ స్వీకారం తర్వాత హోటల్‌కు వెళ్లిపోయాను. తెల్లవారుజామున 4 గంటలకు ఇజ్రాయెల్ దాడిలో హనియా చనిపోవడం గురించి తెలిసి, షాకయ్యాను” అని గడ్కరీ వివరించారు.
