కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సెక్రటేరియట్ (Cabinet Secretariat)లో 250 ఖాళీ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో కాకుండా పోస్ట్ ద్వారా (ఆఫ్‌లైన్‌లో) పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15 నుండి
ఖాళీ పోస్టుల వివరాలు (సబ్జెక్టుల వారీగా): కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 124, డేటా సైన్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): 10, ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్: 95, సివిల్ ఇంజనీరింగ్: 2, మెకానికల్ ఇంజనీరింగ్: 2, భౌతిక శాస్త్రం (Physics): 6, రసాయన శాస్త్రం (Chemistry): 4, గణితం (Maths): 2, గణాంకాలు (Statistics): 2, భూగర్భ శాస్త్రం (Geology): 3, మొత్తం: 250.
విద్యార్హత: BE/BTech (ఇంజనీరింగ్) లేదా MSc (సైన్స్ మాస్టర్స్ డిగ్రీ) చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారికి GATE 2023 / 2024 / 2025 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం: GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
వయోపరిమితి: గరిష్టంగా 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), ఓబీసీ (OBC), ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
జీతం : ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు జీతం ఉంటుంది. దీనికి అదనంగా డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), మెడికల్, పెన్షన్ సహా ఇతర ప్రభుత్వ సదుపాయాలు కూడా ఉంటాయి.
ఆఫ్‌లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
*ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
*తరువాత ఫామ్‌ను ప్రింటవుట్ తీసుకోండి.
*ఫామ్‌లో అడిగిన సమాచారాన్ని అంటే మీ పేరు, వివరాలు వంటివి జాగ్రత్తగా నింపాలి.
*అవసరమైన డాక్యుమెంట్ల కాపీలను (xerox) అటాచ్ చేయండి.
*ఇప్పుడు అన్నీ సరిగ్గా నింపారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
*చివరికి దరఖాస్తు ఫామ్, పేపర్స్ కింద ఇచ్చిన అడ్రసుకు పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా (Address): పోస్ట్ బ్యాగ్ నం. - 001, లోధి రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ - 110003
