హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. గురువారం పఠాన్‌చెరులో కనిష్టంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 6.6 డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, రాజేంద్రనగర్‌లో కనిష్టంగా 8.5 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 10 డిగ్రీలు, బేగంపేట్‌లో 12.2 డిగ్రీలు, హకీంపేట్‌లో 14.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట అత్యధికంగా 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

