V6 News

డిగ్రీ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. మహిళలకు కూడా అవకాశం..

డిగ్రీ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. మహిళలకు కూడా అవకాశం..

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

మొత్తం పోస్టులు: 714.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి (సంబంధిత విభాగం ప్రకారం) మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 17.

అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100.

లాస్ట్ డేట్: జనవరి 15. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్టుతోపాటు పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్/ ఎండ్యురెన్స్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ 
ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.  ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 

కనీస అర్హత మార్కులు: జనరల్/ ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ (ఢిల్లీ) 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/  పీడబ్ల్యూబీడీ 30 శాతం, మాజీ సైనికులకు 5 శాతం సడలింపు ఉంటుంది.

పూర్తి వివరాలకు dsssbonline.nic.in వెబ్​సైట్​ను సందర్శించండి.