V6 News

జనగణనకు నిధుల కేటాయింపు.. ఉపాధి హామీ పనిదినాలు పెరిగినయ్.. వేతనం పెరిగింది: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

జనగణనకు నిధుల కేటాయింపు.. ఉపాధి హామీ పనిదినాలు పెరిగినయ్.. వేతనం పెరిగింది: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

జనగణనకు నిధులు కేటాయింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పనికి ఆహార పథకం పనిదినాల పెంపు, కనీస వేతనం పెంపు.. ఇవి కేంద్ర కేబినెట్ శుక్రవారం (డిసెంబర్ 12) తీసుకున్న కీలక నిర్ణయాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్వణీ వైష్ణవ్.

ALSO READ : వీధి కుక్కల హల్చల్.. 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

  • జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు
  • పూజ్య బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజనగా మార్పు
  • ఈ పథకం కింద పనిదినాల సంఖ్య పెంపు
  • పనిదినాలు100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు
  • కార్మికులకు ఇచ్చే కనీస వేతనం 240 కి పెంపు
  • జనగణనకు నిధుల కేటాయింపుకు మంత్రి మండలి ఆమోదం
  • జనగణనకు రూ.11 వేల 718 కోట్ల కేటాయింపు
  • 2027లో ఫిబ్రవరిలో జనగణన 
  • రెండు విడతల్లో జనగణనతో పాటు కులగణన
  • బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులు
  • ప్రస్తుతం 74 శాతం ఇన్సురెన్స్ రంగంలో పెట్టుబడులు