V6 News

చూస్తుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది.. 15 వేల ఫీట్ల ఎత్తులో.. విమానం రెక్కకు చుట్టుకున్న ప్యారాచూట్..

చూస్తుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది.. 15 వేల ఫీట్ల ఎత్తులో.. విమానం రెక్కకు చుట్టుకున్న ప్యారాచూట్..

ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేలను చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది 15 వేల ఫీట్లు.. అంటే నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకుడమంటే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. స్కై డైవింగ్ చేసేవాళ్లకు ఇలాంటివి కామన్. అయితే అలాంటి సాహసం చేస్తున్న స్కై డైవర్స్ లో ఒకరికి ఊహించని ప్రమాదం జరిగింది. దూకుతుండగా ఓపెన్ అయిన ప్యారాచూట్ విమానం రెక్కకు చుట్టుకుని చచ్చేంత ప్రమాదం ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఈ భయంకర ఘటనకు సంబంధించి వీడియో ఫూటేజ్ రిలీజ్ చేశారు ఆస్ట్రేలియా అధికారులు (ATSB). సౌత్ కైర్న్స్ లోని 16-వే ఫార్మేషన్ జంప్ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు .

ATSB అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. స్కైడైవర్ రిజర్వ్ (అదనంగా ఉన్నది) ప్యారాచూట్ డైవ్ చేస్తున్న సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ రెక్కకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ఆగిపోయాడు. అంతఎత్తులో గాలికి తీవ్రతకు ఇబ్బందికి గురయ్యాడు.అప్పటికే తోటి డైవర్స్ దూకేయగా.. రెక్కకు వేలాడుతూ తీవ్ర భయాందోళన పరిస్థితులకు గురయ్యాడు. 15000 అడుగుల ఎత్తులో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.

ఆ తర్వాత పరిస్థితి ప్రాణాంతకంగా మరేలోపే.. హుక్ నైఫ్ (కత్తి) ఉపయోగించి ఆ ప్యారాచూట్ ను కట్ చేశాడు. ఆ తాళ్లను వదలించుకున్నాక.. కిందికి పడిపోతున్న క్రమంలో మెయిన్ ప్యారాచూట్ ను ఓపెన్ చేసి సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. 

ఇలాంటి జంప్స్ చేస్తున్నపుడు సేఫ్టీ టూల్స్ వాడటం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ATSB చీఫ్ అంగుస్ మిచెల్ చెప్పారు. అయితే ప్యారాచూట్ చుట్టుకోవడంతో ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ కు గురయింది. ప్యారా చూట్ కారణంగా కంట్రోల్ చేయలేక పోతున్నానని ముందుగానే కాల్ చేశాడు. కానీ ఎలాగోలా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు.