V6 News

కొత్త కారు నడిపి అభిమాని ముచ్చట తీర్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి !

కొత్త కారు నడిపి అభిమాని ముచ్చట తీర్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి !

వికారాబాద్ జిల్లా: మంత్రి వివేక్ వెంకటస్వామి పరిగి పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఆయన అభిమాని ఒకరు కారు కొన్నాడు. తన అభిమాన నాయకుడైన మంత్రి వివేక్ వెంకటస్వామితో తన కొత్త కారును డ్రైవ్ చేయించాలని భావించాడు. అభిమాన కోరిక మేరకు.. రిబ్బన్ కట్ చేసి కొత్త కారును మంత్రి వివేక్ వెంకటస్వామి కొద్ది దూరం డ్రైవ్ చేశారు. అభిమాని ముఖంలో సంతోషం వెల్లివెరిసింది.

పరిగి పరిధిలోని నస్కల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నస్కల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. దాదాపు రూ.45 కోట్ల వ్యయంతో 2 ఎకరాల్లో ATC సెంటర్ నిర్మాణానికి సంకల్పించిన సంగతి తెలిసిందే.