నో డౌట్స్.. నో డిలేస్.. సంక్రాంతి బరిలో ‘కాకా’

నో డౌట్స్.. నో డిలేస్.. సంక్రాంతి బరిలో ‘కాకా’

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’.  ప్రస్తుతం ఈ మూవీ  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు  ఇప్పటికే ప్రకటించారు. అయితే చిరంజీవి ‘విశ్వంభర’ గత  కొంతకాలంగా పోస్ట్ పోన్ అవుతుండగా ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమాను సంక్రాంతి రేసులో ఉంచబోతున్నారని, దీనికోసం ‘కాకా’ను వాయిదా వేస్తారనే టాక్  టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీనిపై మూవీ టీమ్ స్పందించింది.

ఈ  ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని చెబుతూ ఈ చిత్రం కచ్చితంగా 2027 సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతోందని కేవీఎన్ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. అలాగే దర్శకుడు బాబీ కూడా ‘నో డౌట్స్, నో డిలేస్’ అంటూ తాము సంక్రాంతికి వస్తున్నామని పోస్ట్ చేశాడు. దీంతో ఈ మూవీ విడుదలపై వస్తున్న రూమర్స్‌‌‌‌‌‌‌‌కు క్లారిటీ దక్కినట్టు అయ్యింది.  ఇక  రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన   టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌  సినిమాపై అంచనాలు పెంచింది. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.