ఫలక్నుమా ఎక్స్​ప్రెస్ ప్రమాదం.. బోగీలను పరిశీలించిన క్లూస్ టీం

 ఫలక్నుమా ఎక్స్​ప్రెస్ ప్రమాదం.. బోగీలను పరిశీలించిన క్లూస్ టీం

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు  ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జూలై 7న   జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బోగీలను అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను పరిశీలించిన 12 మంది క్లూస్ టీం అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును  తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

జులై 7న  హౌరా – సికింద్రాబాద్​ ఫలక్ నుమా ఎక్స్​ప్రెస్​రైలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి బొమ్మాయి పల్లి దగ్గరకు రాగానే బోగీల్లో షార్ట్ ​సర్క్యూట్​తో మంటలు చెలరేగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 7  బోగీలు కాలి బూడిదయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపిస్తుండటంతో అధికారులు ట్రైన్​ లింక్​ తొలగించారు. ప్రయాణికులు అప్రమత్తం అయి చైన్​ లాగడంతో పెను ప్రమాదం  తప్పింది.