
సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి భువనగిరి వెళ్లనున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, అధికారులు సభా ప్రాంగణం తో పాటు, కలెక్టరేట్ సుందరీకరణ పనులను పరిశీలించారు. సీఎం సభకు జిల్లా నలుమూలల నుంచి లక్షకు పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు... ఎమ్మెల్యే గొంగిడి సునీత. సీఎంకు ధన్యవాదాలు చెప్పటానికి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనునట్టు తెలిపారు గొంగిడి సునీత.