యాదాద్రి పునః ప్రారంభ తేదీ రేపు ప్రకటన

V6 Velugu Posted on Oct 18, 2021

  • యాదాద్రి ఆలయాన్ని రేపు పరిశీలించి పునః ప్రారంభం తేదీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్ 

హైదరాబాద్: యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన ఆలయ నిర్మాణ పనులను రేపు (మంగళవారం, 19 అక్టోబర్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించనున్నారు. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి యాదాద్రి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నిటినీ మరోసారి సీఎం కేసిఆర్ పరిశీలిస్తారు. చినజీయర్ స్వామి వారు యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని  ఇప్పటికే నిర్ణయించి వున్నారు.

అయితే సీఎం కేసీఆర్ యాదాద్రి పనులను పరిశీలించిన తర్వాత ఆలయ పున: ప్రారంభం తేదీలను ప్రకటిస్తారు.  పున: ప్రారంభం  సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
 

Tagged cm, Telangana, KCR, Yadadri, visit, temple reopen, yadadri temple reopen

Latest Videos

Subscribe Now

More News