ఉక్రెయిన్ నుండి స్టూడెంట్లను తీసుకొచ్చే ఖ‌ర్చు ప్ర‌భుత్వానిదే

ఉక్రెయిన్ నుండి స్టూడెంట్లను తీసుకొచ్చే ఖ‌ర్చు ప్ర‌భుత్వానిదే

ఉక్రెయిన్ నుండి తమ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను తమిళనాడు ప్రభుత్వం భరిస్తుంద‌ని సీఎం స్టాలిన్ తెలిపారు. ఫిబ్రవరి 24 నుండి రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి సంబంధించిన అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఎంకె స్టాలిన్ చెప్పారు. దీనికి సంబంధించి  శుక్రవారం  అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం తూర్పు ఐరోపా దేశంలో చిక్కుకుపోయిన 916 మంది విద్యార్థులు, వలసదారులు తరలింపు కోసం అభ్యర్థించడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలతో పాటు న్యూఢిల్లీలోని ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. రష్యా సైనిక దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ నుండి 5,000 మంది తమిళనాడు విద్యార్థులు , వలసదారులను తరలించేందుకు ప్రత్యేక వందే భారత్ మిషన్ విమానాలను ప్రారంభించాలని స్టాలిన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఆ దేశంలో మెజారిటీ విద్యార్థులు ..ప్రొఫెషనల్ డిగ్రీలు చదువుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‎లో చిక్కుకున్న విద్యార్ధులకు గమనిక