ఉక్రెయిన్‎లో చిక్కుకున్న విద్యార్ధులకు గమనిక

ఉక్రెయిన్‎లో చిక్కుకున్న విద్యార్ధులకు గమనిక

హంగేరిలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటనలు చేసింది. ఉక్రెయిన్‎లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను తరలించడానికి కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. చిక్కుకున్న వారిని హంగేరి, రుమేనియా మీదుగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న  హుజూర్ద్, చెర్నీ వేస్ట్  ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీములుగా బయలుదేరాలని తెలిపింది. విద్యార్థులు, పౌరులు పాస్‎పోర్టులు, డాలర్లు, నిత్యవసరాలతో  సిద్ధంగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా.. తమ వెంట కరోనా డబుల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా.. వారు ప్రయాణిస్తున్న వాహనంపై భారత జాతీయ జెండా ప్రింటవుట్ ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

For More News..

బంకర్ నుంచి వీడియో తీసి పంపిన హైదరాబాద్ విద్యార్థులు

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..