
అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC), తెలంగాణ రైజింగ్-2047 పై సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నియోజకవర్గానికో ఏటీసీ సెంటర్
రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై గతేడాది టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని ఒప్పందంలో నిర్ణయించారు. వాటికి అదనంగా ఐటీఐలు లేని నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఏటీసీలను ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. వాటిలో భాగంగా 46 ఏటీసీలను ఏర్పాటు చేయనుంది.
ALSO READ | కులగణన, బీసీ రిజర్వేషన్లపై ..జులై 24న ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీఎల్ కలిపి రూ.45.15 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. మొత్తం 46 కేంద్రాలకు రూ.2076.90 కోట్లు ఖర్చవుతుండగా, వీటిలో టీటీఎల్ కంపెనీ రూ.1426.46 కోట్లు (86 శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.650.44 (14 శాతం) కోట్లు ఖర్చు భరించనున్నాయి. పదో తరగతి పరీక్ష పాస్ అయితే చాలు ఏటీసీల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉండడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు లాభం చేకూరనుంది.