
జులై 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారని చెప్పారు ఎంపీ మల్లు రవి. కులగణన సర్వేపై నిపుణుల కమిటీ నివేదికను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు అందజేయనున్నారని చెప్పారు.. అనంతరం సాయంత్రం 5 గంటలకు కులగణన, బీసీ రిజర్వేషన్లపై ఇందిరా భవన్ లో కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చర్చించాలని కోరనున్నారని తెలిపారు.
పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరపాలని పట్టుబడితే పదే పదే సభను వాయిదా వేస్తున్నారని మల్లు రవి చెప్పారు. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియజేయాలని తాము కోరామన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.
ALSO READ |యువతకు ఉద్యోగాలు కావాలి... కాంగ్రెస్తోనే యువత జీవితాల్లో మార్పు: మల్లికార్జున ఖర్గే
సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.