
హైదరాబాద్ ఔటర్ రీజినల్ పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నాయని.. అందులో నిలబడడానికి ప్లేస్ లేదు.. కుర్చోవడానికి కుర్చీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ది అంటున్నా.. దిగ్గజ కంపెనీలున్నాయని గొప్పలు చెబుతున్నాం కానీ..ఇంత వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మౌలిక వసతులు లేవని చెప్పారు.
గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు శంకుస్థాపన చేసిన సీఎం... సంవత్సరానికి 15 వేల కోట్ల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే వాళ్లు డబ్బులు చెల్లించి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు సీఎం. వేల కోట్ల ఆదాయం ఇచ్చే వాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వస్తే కుర్చోవడానికి కుర్చీలేని పరిస్థితి ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను 8 నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు సీఎం.
మూసీ ప్రక్షాళన జరగాలి
హైదరాబాద్ అభివృద్ది జరగాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనన్నార సీఎం రేవంత్.. అభివృద్దిని అడ్డుకునే వాళ్లే శత్రువులని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి వచ్చే వాళ్లను ప్రజలే అడ్డుకోవాలని సూచించారు రేవంత్. న్యూయార్క్,టోక్యో సింగపూర్ తో హైదరాబాద్ కు పోటీ పడుతుందన్నారు. మూసీ ప్రక్షాళన కొంత మందికి ఇష్టం లేదన్నారు రేవంత్ . హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు .