ముందే చెప్పారు కదా బ్రో జాగ్రత్త లేకపోతే ఎలా : ఆదివారం రాత్రి 40 మంది డ్రంక్ డ్రైవ్ లో దొరికారు

ముందే చెప్పారు కదా బ్రో జాగ్రత్త లేకపోతే ఎలా : ఆదివారం రాత్రి 40 మంది డ్రంక్ డ్రైవ్ లో దొరికారు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలుపెట్టాం.. 2026, జనవరి 2వ తేదీ వరకు హైదరాబాద్ సిటీ మొత్తం స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.. మందు తాగి బయటకు రావొద్దు.. జాగ్రత్త అంటూ వారం రోజులుగా చెబుతున్నా.. ఎవడూ వినటం లేదు.. దీనికి ఎగ్జాంపుల్ 2025, డిసెంబర్ 28వ తేదీ ఆదివారం అర్థరాత్రి వరకు హైదరాబాద్ సిటీలో దొరికిన మందు ప్రియులే సాక్ష్యం. 

న్యూ ఇయర్ దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనికీలు ముమ్మరం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీ పరిధిలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, SR నగర్ ట్రాఫిక్ ఏరియాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఈ నాలుగు ఏరియాల్లోనే ఏకంగా 40 మంది పట్టుబడ్డారు. ఇందులో 8 కార్లు ఉండగా.. 32 బైక్స్ ఉన్నాయి. ఈ 40 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. పట్టుకున్న వాహనాలు అన్నింటినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుపడిన వారు కౌన్సిలింగ్ కు అటెండ్ అయ్యి.. కోర్టుకు హాజరు అవ్వాల్సిందిగా సూచించారు పోలీసులు. 

పోలీసులు, మీడియాపై రెచ్చిపోయిన యువకుడు :

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన DDలో.. గ్రీన్ ల్యాండ్స్ హోటల్ దగ్గర మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా.. విజువల్స్ తీస్తున్న మీడియాపైకి దూసుకొచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ కంప్లయింట్ తో మద్యం మత్తులో తిట్టిన ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.