కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా మలేషియాలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
కౌలాలంపూర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఇటీవల పొలిటికల్ పార్టీ పెట్టిన విజయ్‌కు ఇదే చివరి మూవీ అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా దీనిపై ఆయన అధికారికంగా ప్రకటించారు.
సినిమాలకు గుడ్ బై చెప్పడం ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు సపోర్ట్‌గా నిలిచిన వారికోసం తాను 30 ఏళ్లు నిలబడతానని, ఇక తన జీవితం అభిమానులకే అంకితం అని చెప్పారు.
ఈ సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపడానికి విజయ్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.
