మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి లోయలో పడిన రైలు.. 13 మంది మృతి

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి లోయలో పడిన రైలు.. 13 మంది మృతి

మెక్సికోలో రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 13 మంది మృతి చనిపోయారు. 98 మందికి గాయాల పాలయ్యారు. మెక్సికోలోని సౌత్ స్టేట్ ఓక్సాకాలో ఆదివారం ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటన జరిగింది. నిజాండా పట్టణానికి దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులతో ఈ రైలు వెళుతుండగా దుర్ఘటన జరిగింది.139 మంది స్వల్ప గాయాలతో బయటపడగా, 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మాటియాస్ రొమెరోకి వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పి లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. రైలు బోగీ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి అధికారులు తాళ్లు, ప్రత్యేక పరికరాలను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఇంటర్ ఓషియానిక్ రైలును 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రారంభించారు.