
తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న సీఎం రేవంత్ ..తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు.
విద్యాశాఖను తీసుకునేందుకు నేతలెవరూ సుముఖత వ్యక్తం చేయడట్లేదని చెప్పారు రేవంత్ . తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. పీపీపీ మోడల్ లో యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రేవంత్. యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీకి రూ.5కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ఐటీఐ స్టూడెంట్స్ కు టీచింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు . యూత్ స్కిల్స్ అభివృద్ధిలో సౌత్ కొరియా అగ్రస్థానం ఉందన్నారు.
పేదలు ,మైనార్టీల కోసం కేసీ వేణుగోపాల్ నిరంతర పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందశాతం అక్షరాస్యతో దేశంలోనే కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. విద్యకు,కేరళకు విడదీయరాని అను సంబంధం ఉందన్నారు సీఎం. కేసీ వేణుగోపాల్ అండతోనే తెలంగాణ అభివృద్ధిపై మరింత ఫోకస్ చేశామన్నారు రేవంత్.
నియోజకవర్గాన్ని ప్రియాంక గాంధీ కర్మ భూమిగా భావిస్తారని చెప్పారు రేవంత్. తెలంగాణలో పోటీకి ప్రియాంక గాంధీని ఆహ్వానించాం.. కానీ కేసీ వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకే ప్రియాంక కేరళలో పోటీ చేశారన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 మిలియన్ డాలర్ల ఎకానమీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేరుకుంటుందన్నారు రేవంత్.