బ్రిడ్జిలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి : ఆశిష్ సంగ్వాన్

బ్రిడ్జిలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి :  ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జిలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం పాల్వంచ, బీబీపేట మండల కేంద్రాల సమీపంలోని బ్రిడ్జిలను పరిశీలించి మాట్లాడారు.  బీబీపేట బ్రిడ్జి పనులు త్వరగా కంప్లీట్ చేయాలన్నారు. పాల్వంచలో కూలిన ఇండ్లను పరిశీలించి వివరాలు సేకరించాలన్నారు. సాధారణ పరిస్థితులు వచ్చేవరకు శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలన్నారు. ఆర్అండ్​బీ ఈఈ  మోహన్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.  

అధికారులు అలర్ట్​గా ఉండాలి.. 

జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​  ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రెసిడెన్షియల్ స్కూల్స్​తో పాటు, ఆయా చోట్ల హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.