కామారెడ్డి, వెలుగు: జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆఫీస్‌లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువుల వద్ద ఏర్పాట్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్లో సద్దుల బతుకమ్మ వరకు రోజుకు ఒక శాఖ బతుకమ్మ సంబురాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్లో సోమవారం మహిళా సమాఖ్య సభ్యులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో రోడ్ల రిపేర్లు..
జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. రోడ్ల రిపేర్ల కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం రోడ్ల మరమ్మతు వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే 60 రోజుల్లోగా గుంతలను పూడ్చాలని స్పెషల్ టీమ్‌కు సూచించారు. అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
భూ సేకరణపై వీడియో కాన్ఫరెన్స్..
హైవేల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు సూచనలు చేశారు. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఎఫ్‌వో నిఖిత, అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
