జగదేవ్పూర్ మండలంలో కలెక్టర్ పర్యటన

జగదేవ్పూర్ మండలంలో కలెక్టర్ పర్యటన

జగదేవ్​పూర్, (కొమురవెల్లి) వెలుగు: జగదేవ్​పూర్​మండలంలో మంగళవారం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఓపి కౌంట్, ఫార్మా కౌంట్, మెడికల్ ఆఫీసర్ కౌంట్ తప్పనిసరిగా మ్యాచ్ కావాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవోకు సూచించారు.

 అనంతరం తహసీల్దార్ ఆఫీసులో భూభారతి పెండింగ్ అప్లికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహసీల్దార్​కు చెప్పారు. మండలంలోని దౌలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. గ్రామంలో 24 ఇండ్లు శాంక్షన్ కాగా 22 గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీవో రాంరెడ్డి ఉన్నారు.