
- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కేంద్ర పథకాల అమలు ప్రక్రియపై అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ, సాగి స్కీమ్, సెర్ప్, ఆర్జిస్, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, పీఎం స్వనిధి, నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్ మాన్ భారత్, ఉజ్వల స్కీమ్ వివరాల గురించి ఆరా తీశారు.
సీఆర్ఎఫ్ కింద రోడ్ డెవలప్ పనులను పూర్తి చేయాలని అర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన కాలేజ్ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వంట గదికి అన్నం కూరలను తనిఖీ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా బాలికల స్కూల్ ను సందర్శించారు. పక్కన మిషన్ భగీరథ వాటర్ వృథాగా పోతున్న విషయాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.