వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డెంటల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పుష్పాంజలి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శాలువలు, పూల బొకేలు కాకుండా పేద విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రిని తీసుకురావాలని కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు, వసంత పంచమిని పురస్కరించుకుని ఈ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ పాల్గొన్నారు.
