ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  ఎన్నికల సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..  స్థానిక ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండో విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్పీటీసీ సభ్యుల నామినేషన్లు స్వీకరణ జిల్లా పరిషత్ ఆఫీసులో తీసుకుంటారన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆర్వో, ఏఆర్వోల సందేహాలను నివృత్తి చేసేందుకు జడ్పీ సీఈవో ఆఫీసులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఎస్పీ పరితోశ్​పంకజ్​మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, నారాయణఖేడ్ సబ్  కలెక్టర్ ఉమాహారతి, డీపీవో సాయి బాబా, ఆర్​వోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు