వెల్​నెస్ సెంటర్​కు ఫండ్స్​ ఇస్తాం : రాజీవ్ ​గాంధీ హనుమంతు

వెల్​నెస్ సెంటర్​కు ఫండ్స్​ ఇస్తాం  : రాజీవ్ ​గాంధీ హనుమంతు
  • కలెక్టర్ రాజీవ్ ​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్ వెల్​నెస్ సెంటర్​లో వసతుల కల్పనకు అవసరమైన ఫండ్స్​ఇస్తామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్​నగరపాలక సంస్థ బిల్డింగ్​లో కొనసాగుతున్న వెల్​నెస్​సెంటర్ ను శనివారం ఆయన విజిట్ చేశారు. సెంటర్​లో వెయిటింగ్​ హాల్, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, మెడిసిన్​ డిస్ట్రిబ్యూషన్ ​పాయింట్స్​ ఏర్పాటు చేయాలన్నారు. 

నాణ్యమైన వైద్య సేవలందించాలని డాక్టర్లకు సూచించారు. రిటైర్డ్​ ఎంప్లాయీస్​ యూనియన్​ఆఫీస్​కు వెళ్లిన కలెక్టర్​అక్కడ మీటింగ్ హాల్, వెహికల్స్​పార్కింగ్​కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్​ దిలీప్​కుమార్, ఇన్ చార్జి​ ఆర్డీవో స్రవంతి, రిటైర్డ్​ఉద్యోగుల సంఘం లీడర్లు రవీందర్​రావు, భూమాగౌడ్, రామ్మోహన్​రావు ఉన్నారు.