గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎండీడీకేవై (ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన) లో జోగులాంబ గద్వాల జిల్లా ముందుండేలా సంబంధిత శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్ తో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డేటా ఆధారిత పాలన ద్వారా జిల్లాలో అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు.
ప్రతీ శాఖ లక్ష్యాలు సాధించాలని, నిర్దేశిత పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. చేసిన ప్రతీ పనిని డేటాలో చూపించాలని, చిన్న పురోగతినైన నమోదు చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ ఆఫీసర్ వీరప్ప, డీఆర్డీఓ ముసాయిదా తదితరులు పాల్గొన్నారు.
