
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిలకు 10 రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. అప్రోచ్ పనులు తొందరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం -నారాయణపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ మీదే చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నదానాన్ని ప్రారంభించారు. జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏవో రాంరెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.