మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సోర్స్లను లెక్కిస్తాం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ జిల్లాలో  మైనర్ ఇరిగేషన్ సోర్స్లను లెక్కిస్తాం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడే చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్​లు, బోర్లు తదితర మైనర్ ఇరిగేషన్ సోర్స్ లు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తామని కలెక్టర్​ విజయేందిర బోయి తెలిపారు. 7వ మైనర్ ఇరిగేషన్, వాటర్ రిసోర్స్ సెన్సెస్ కోసం జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  

సోమవారం కలెక్టరేట్ లో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిటీకి తాను చైర్మన్ అని,  సభ్యులుగా డీఆర్వో, ఇరిగేషన్ ఆఫీసర్, విద్యుత్​శాఖ ఎస్ఈ, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ, భూగర్భ నీటి పారుదల శాఖ డీడీ, డీఆర్డీవో, డీఏవో, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈఈ, డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని చెప్పారు. 

చిన్న నీటి వనరుల లెక్కింపు ప్రారంభానికి ముందు గ్రామ ఎన్యుమరేటర్లుగా ఉండే ఏఈవోలు, విలేజ్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రెటరీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తామన్నారు. తహసీల్దార్లు వారం రోజుల్లో చార్జి రిజిస్టర్ తయారు చేసి, శిక్షణ తరగతులు పూర్తి చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) మధుసూదన్ నాయక్, డిస్ట్రక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ పాల్గొన్నారు.