
- కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ బడుల్లో క్వాలిఫైడ్ ఉన్నారని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రశంసించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా టీచర్లు ఆధునిక, సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించి విద్యాశాఖ ఔన్నత్యాన్ని పెంచాలని సూచించారు. జిల్లాలోని బడుల్లో వసతుల కోసం రూ.42 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ట్రిపుల్‌ఐటీ, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలనిచెప్పారు.
ఉపాధ్యాయ వృత్తి గొప్పది : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యంత గౌరవనీయమైనదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. ఉత్తమ బోధనతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన పద్ధతులు మార్చుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 40 మందిని శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు.