మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాల పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జరిపింది కుకీ ఉగ్రవాదులుగా పోలీసుల అనుమానిస్తున్నారు. మోరే సమీపంలోని చెక్ పోస్ట్‌పై బాంబులు విసిరారినట్టు తెలుస్తుంది. ఆర్మీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. మరణించిన అధికారి డబ్ల్యూ సోమోర్జిత్‌గా గుర్తించారు.

 మరో కమాండోకు గాయాలయ్యాయి. పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో చాలా సేపు యుద్ధ వాతావరణం నెలకొంది. గంటకుపైగా కాల్పులు జరిగినట్టు సమాచారం. మోరేలో ఒక పోలీసు అధికారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ హింస జరిగింది. శాంతి భద్రతలకు మప్పు వాటిల్లుతుందనే భయంతో మణిపూర్ ప్రభుత్వం జిల్లా మొత్తం కర్ఫ్యూ విధించింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మరియు అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుండి మినహాయింపునిచ్చింది.