కెమికల్ ఇంజనీర్ పై పోలీసులకు ఫిర్యాదు

కెమికల్ ఇంజనీర్ పై పోలీసులకు ఫిర్యాదు
  • వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు

హైదరాబాద్: కరోనా గురించి న్యూస్ ఛానెల్ లైవ్ లో ఇష్టారాజ్యంగా మాట్లాడిన కెమికల్ ఇంజనీర్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. థర్డ్ వేవ్ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న కెమికల్ ఇంజనీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిజమేనని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కొన్ని న్యూస్ ఛానెళ్లలో కరోనా థర్డ్ వేవ్ గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయని, ఒక కెమికల్ ఇంజనీర్ వేవ్ గురించి చాలా దారుణంగా మాట్లాడారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదిక మీద.. కరోనా థర్డ్ వేవ్ గురించి మాట్లాడతారు..?  సామాజిక బాధ్యత లేదా ? అని ఆయన ప్రశ్నించారు. అనవసరంగా అసత్య ప్రచారాలు చేసి భయాందోళనకు గురిచేయవద్దని ఆయన సూచించారు.

ప్రభుత్వం తో పాటు పౌరుడికి బ్యాధాతలు ఉంటాయని, అందుకే కెమికల్ ఇంజనీర్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామన్నారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లల్లో వస్తుందని ఎన్నో ప్రచారాలు వస్తున్నాయని, ఇప్పటి వరకు అయితే మూడవ వేవ్ వస్తుందో లేదో తెలియదని, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా పిల్లల కోసం, పెద్దవారి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. యుద్ధ సమయంలో ఎలా పని చేస్తామో అలా పని చేస్తున్నామని, 3 నెలల్లో కరోనా 2వ వేవ్ పూర్తయ్యిందని ఆయన తెలిపారు.