
- భారీ వర్షాల నేపథ్యంలోనిర్ణయం: పీసీసీ
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన ‘కాంగ్రెస్ బీసీ సభ’ను వాయిదా వేశామని పీసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సభను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరింది.