మంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి

మంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి
  • కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రజలకు మంజీర నీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్​నేత జగ్గారెడ్డి సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదనంగా కొత్త ఫిల్టర్ బెడ్, కొత్త ఇంటెక్ వెల్ నిర్మాణం చేయాలన్నారు. అవసరమైన చోట కొత్త లైన్స్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. 

వచ్చే 50 ఏళ్ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీకి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మిషన్ భగీరథతో సంబంధం లేకుండా సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజలకు మంజీరా నీళ్లు సరఫరా చేయాలనేది తన లక్ష్యమన్నారు. రాజంపేట ఫిల్టర్ బెడ్ ఇంటెక్ వెల్ పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.