
సిద్దిపేటలో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకులు క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రాజశేఖర్ కుడి కన్నుకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్ 2013 బ్యాచ్ కి చెందిన వాడు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.