ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. చవితి ఉత్సవాలకు బ్రేక్

ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. చవితి ఉత్సవాలకు బ్రేక్

అమరావతి: రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా మరికొంత కాలం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.  థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం
కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఉత్సవాలకు, విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిన కేసులపై అధ్యయనం చేసి వారిపై దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు.