 
                                    ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొడాలి నాని ఆరోగ్యం పట్ల ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏఐజీ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా సోకింది. ఆయన కూడా హైదరాబాద్ ఏఐజీలోనే చికిత్స తీసుకుంటున్నారు.
మరిన్ని వార్తల కోసం..

 
         
                     
                     
                    