మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలె

మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలె

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద నమోదైన కరోనా కేసుల సంఖ్య 1.94 లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన మోడీ సర్కార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలని, కనీసం 48 గంటలకు సరిపడా ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ఓ లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలని ఆ లెటర్ లో ఆయన సూచించారు. దీనికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్నారు. 

మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నిర్వహణ పైనా శ్రద్ధ వహించాలని రాజేశ్ భూషణ్ కోరారు. ఈ ప్లాంట్ల పనితీరు, తగినంత ఆక్సిజన్ గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలను విస్తృతపర్చాలని సూచించారు. కాగా, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయన మంగళవారం కొన్నిరాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల ఆక్సిజన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లు పనిచేసేలా రెడీ చేసుకోవాలని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

సారీ సైనా.. కావాలని కామెంట్ చేయలే

కాళ్లపై బురద పడిందని.. తుడుపించుకున్న లేడీ పోలీస్

థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవ్