ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవిత బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పరిహారం మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.40 లక్షల బీమా సదుపాయం కల్పించనుంది. అలాగే శాశ్వత వికలాంగులైతే రూ.30 లక్షలు, సహజ మరణాలకు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్.బి.ఐ తో బీమా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య, వివాహ రుణాల మాఫీ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.