
- సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యమని సీపీ అనురాధ అన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు గురైతే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలోని హాట్ స్పాట్స్ వద్ద షీటీమ్స్ తో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈవ్‌టీజర్స్ 49 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి 49 పెట్టి కేసులు,2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, డివిజన్ల వారీగా షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. పోక్సో, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు భరోసా సెంటర్, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ అండగా నిలుస్తున్నాయని తెలిపారు.