
నస్పూర్, వెలుగు: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నవారికి పట్టాలివ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నస్పూర్ తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు మెమోరాండం అందించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీ ల హామీలను అమలు చేయాలన్నారు.
నస్పూర్ మండల పరిధిలో సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకొన్న కొందరికి గత ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చిందని, సింగరేణి స్థలాలను రెవెన్యూకు అప్పగించి పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రేగుంట చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.